బిగ్ బాస్ లో ముమైత్ కి భలే ఛాన్స్ఇప్పుడు బిగ్ బాస్ చూడందే అస్సలు తెలుగు ప్రేక్షకులు చాలామంది నిద్రే పట్టట్లేదు. ఏముందిలో అనుకున్న రేంజ్ నుండి ఏమవుతుందో అంటూ ఆతృత క్రియేట్ చేసే రేంజుకు వచ్చేసింది ఈ టివి షో. తొలిసారిగా తెలుగులోకి ఇటువంటి షో రావడం ఒకెత్తయితే.. దీనిని జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేయడం మరో ఎత్తు. దాని కారణంగా మాంచి రెస్పాన్స్ వచ్చేసింది.

అయితే గత వారం.. ఈ బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో మాత్రం జనాలకు సస్పెన్స్ హోరెత్తిపోయింది. అసలు ఈ కార్యక్రమంలో ఎంతో యాక్టివ్ గా ఉండే ముమాయత్ ఖాన్ ఎలిమినేషన్ ఫేస్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. శనివారం నాడు హరితేజ ధనరాజ్ లకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం కలిగించిన జూనియర్ ఎన్టీఆర్.. ఆదివారం హీరోయిన్ అర్చన.. ఐటెం బాంబ్ ముమాయత్ లలో ఎవరికి ఉద్వాసన పలుకుతాడు అంటూ అందరూ షాకవుతున్నవేళ.. ఎన్టీఆర్ ముమాయత్ పేరును చెప్పాడు. పీపుల్స్ పోల్ లో ఆమె పేరే వచ్చిందట. అయితే ఆమెకు మరో అవకాశం కల్పిస్తూ ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్.

ఇలా బిగ్ బాస్ నుండి హ్యాపెనింగ్ కంటెస్టంట్లను ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందో అనుకున్నారేమో.. వెంటనే ముమాయత్ కు తిరిగి రావడానికి ఛాన్సిచ్చారు. ఆల్రెడీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొనడానికి ఆమెకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్.. ఇప్పుడు ఆమెను సీక్రెట్ రూములో ఉండి హౌస్ లో జరిగేదంతా చూడమని.. త్వరలోనే మళ్ళీ హౌసులోకి ఆమెను ప్రవేశపెడతామని తెలిపారు. మొత్తానికి ముమాయత్ భలే లక్కీ గురూ!

ThanQ Visit Again.

Related Posts