YSR పార్టీ లోకి దగ్గుపాటి దంపతులు


ఏపీ సీఎం చంద్రబాబు తోడల్లుడు అన్న నందమూరి తారక రామరావు  పెద్దల్లుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? విపక్ష నేత జగన్  చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయంటే అవుననే అంటున్నారు  పోలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయాలపై తీవ్ర చర్చకు దారి తీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్త కాదు. గతం లో ఆయన టీడీపీలో, కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు.

ఆయన సతీమణి అన్నగారి కూతురు పురంధేశ్వరి కూడా కేంద్రం లో మంత్రిగా చక్రం తిప్పారు. అయితే గత కొన్నాళ్లుగా దగ్గుబాటి రాజకీయాలకు  దూరంగా ఉన్నారు. కానీ పురంధేశ్వరి మాత్రం యాక్టివ్ పోలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 2019 ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయింది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు జగన్ లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు టికెట్ల  హామీలు ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి  పోలిటికల్ గా మరోసారి అరంగేట్రం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన గానీ ఆయన కుమారుడిని గానీ రంగంలోకి దింపాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట!…

దీనికిగానే  ఇప్పటివరకు ఫ్యామిలీలో చర్చలు పూర్తయ్యాయని  అందుకే దగ్గుబాటి ఇప్పుడు పార్టీల అన్వేషణలో పడ్డారని సమాచారం. అంటే 2019 నాటికి బలమైన పక్షంగా ఉండే పార్టీలో చేరాలని అదే సమయంలో పరుచూరి నియోజక వర్గాన్ని తమ చేతుల్లో పెట్టే పార్టీని ఆయన ఎంచుకుంటున్నారని అంటున్నారు. దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం వచ్చారు. ఈ సమయంలో ఆయన మాజీ ఎంపీ ఉండవల్లిని వెంట తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇదే అనుమానానికి అవకాశం కల్పించింది. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన పేరుతో దగ్గుబాటి ఉండవల్లిని భేటీ అయ్యారా అన్న చర్చకు వచ్చింది. కేవలం రాజకీయాలను చర్చించేందుకే దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఉంటారంటున్నారు విశ్లేషకులు.

ఈ సందర్భంగా ఉండవల్లి దగ్గుబాటిల మధ్య రాజకీయంగా చర్చలు బాగా నడిచాయంటున్నారు. తానుగానీ, తన కుమారుడుగానీ పోలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఏపార్టీ అయితే బాగుంటుందని దగ్గుబాటి చర్చించినట్టున్నారు అని అంటున్నారు. ఇప్పటికే తన భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉన్నందున ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఎలా ఉంటుందని చర్చింపుకు వచ్చింది. వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పరుచూరు సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉంటుందని, ఒక వేల ఇరువురి మధ్య పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటని చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

ఇక అదే సమయంలో జగన్ పార్టీ వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందన్న విషయం చర్చకు వచ్చింది. ముఖ్యంగా కుమారుడు పోలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీలోకి వెళ్ళడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో  ఉండవల్లి జగన్ పార్టీ లోకే చేరడమే  మంచిదన్నట్లుగా తెలిసింది. మరి రాబోయే రోజుల్లో దగ్గుబాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక జగన్ పార్టీలోకి చేరితే కేవీపీ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి రెండు సూపర్ ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పురంధేశ్వరికి కోస్తాలో ఆమె కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎంపీ సీటుతో పాటు ఆమె తనయుడు చెంచురామ్ లేదా భర్త వెంకటేశ్వరరావుకు  పరుచూరు అసెంబ్లీ సీటుపై హామీ వచ్చినట్లు సమాచారం.

ThanQ Visit Again.

Related Posts