బాలయ్య 102వ సినిమా హీరోయిన్ గా నయనతార సంక్రాంతికి రిలీజ్సింహా సినిమాతో బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిన నయనతార - ఆ తరువాత శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో నటించి నందమూరి అభిమానుల్ని మెప్పించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నూరవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా నయనతారను తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో నయన్ - కోలీవుడ్ లో బిజీగా ఉండటమే మెయిన్ రీజన్ అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సీ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కే.ఎస్.రవికుమార్ దర్శకుడు.

ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు తాజాగా నయనతార హాజరవుతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతుందని నయన్ - బాలయ్య మధ్య నడిచే సన్నివేశాలు సింహాని తలపిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూకుడు మీదున్న బాలయ్య నుంచి ప్రస్తుతం పైసా వసూల్ రాబోతుంది. ఆ తరువాత సంకాంత్రికి ఈ 102వ సినిమా వస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన నయన్ - ఎలా కనిపించబోతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.

ThanQ Visit Again.

Related Posts