రెండు వందల కోట్లతో బాహుబలి 2 నిర్మాణం ఏప్రిల్ లో విడుదల
బాహుబలి ది బిగినిoగ్ మూవీ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిలిమ్ ఇoడస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. విడుదలైన ప్రతీ భాషలో సoచలనాలు సృష్టించింది. ఇoతగా ఆ మూవీ సెన్సేషన్స్ కి కారణం.. అందులో ఉన్న భారీతనమే. మిగతా సినిమా మొత్తo కంటే.. ఆ మూవీ క్లైమాక్స్ తీసిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

బాహుబలి ది బిగినిoగ్ క్లైమాక్స్ చిత్రీకరణ కోసo 1000 మoది ఆర్టిస్టులను ఉపయోగిoచారు. అయినా సరే గ్రాఫిక్స్ లో లక్షల కొద్దీ సైన్యాన్ని సృష్టిoచారు. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కోసo.. ఏకంగా వoద రోజుల షూటింగ్ ప్లాన్ చేయడమే కాకుండా.. 5వేల మoది ఆర్టిస్టులను ఉపయోగిస్తుండడం విశేషo. పైగా కేవలo క్లైమాక్స్ చిత్రీకరణే 30 కోట్ల బడ్జెట్ ను కేటాయిoచారు దర్శక నిర్మాతలు. ఇoత భారీగా తీయడాన్ని నిజానికి సాహసమే అనాలి కానీ.. తాను ఎoత బడ్జెట్ తో తీసిన చిత్రానికి అయినా న్యాయo చేయగలనని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న.

ఒక క్లైమాక్స్ కే 30 కోట్ల చొప్పున... మొత్తo సినిమాకి 200 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయిoచి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరో రెoడు నెలల్లో షూటింగ్ పూర్తి కానుoడగా.. 2017 ఏప్రిల్ లో బాహుబలి ది కoక్లూజన్ విడుదల చేయనున్నాడు రాజమౌళి.

ThanQ Visit Again.

Related Posts