సాక్షి టీవీ ప్రసారాలను మేము ఆపలేదు ఏపీ ప్రభుత్వం

ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారంటూ సాక్షి యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. తమ క్లయింట్ ఛానల్ ప్రసారాల్ని అక్రమంగా నిలిపివేసినట్లుగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ.. ‘‘సాక్షి టెలివిజన్ ఛానల్  ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వలేదు’’ అని హైకోర్టుకు చెప్పారు.

ప్రభుత్వం నుంచి ఎంఎస్ వోలకు ఎలాంటి ఆదేశాలు వెళ్లలేదని.. ప్రసారాలు ఆపాలని సూచించలేదంటూ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇదే విషయాన్న అఫిడవిట్ లో సమర్పించాలంటూ ఆదేశిస్తూ.. ఈ కేసును మూడు వారాలపాటు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. తుని విధ్వంసం తర్వాత.. ఈ ఘటనలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలతో అరెస్ట్ ల పర్వం మొదలుకావటం.. దానికి నిరసనగా ముద్రగడ దీక్షను చేపట్టిన తర్వాత.. తమ ప్రసారాల్ని ఏపీ సర్కారు నిలిపివేసిందంటూ సాక్షి ఆరోపిస్తోంది. తాజాగా హైకోర్టులో ఏపీ సర్కారు వాదనల నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ThanQ Visit Again.

Related Posts