Dwadasa Jyothirlingalu ద్వాదశ జ్యోతిర్లింగాలు


సోమనాథ్ – సోమనాథుడు – గుజరాత్
శ్రీశైలం మల్లికార్జునుడు- కర్నూలు
ఉజ్జయని – మహాకాళేశ్వరుడు – ఉజ్జయని
ఓంకార్ – ఓంకారేశ్వరుడు - మధ్యప్రదేశ్
వైద్యనాధ్ – వైద్యనాథుడు - మహారాష్ట్ర
భీమశంకర్ – భీమశంకరుడు - మహారాష్ట్ర
రామేశ్వర్ – రామేశ్వరం – తమిళనాడు
నాగేశ్వర్ – నాగేశ్వరుడు - గుజరాత్
కాశీ – విశ్వేశ్వరుడు – వారణాశి
నాసిక్ – త్రయంబకేశ్వరుడు - మహారాష్ట్ర
కేదారనాథ్ – కేదారేశ్వరుడు-ఉత్తరాంచల్
ఘృశ్నేశ్వర్ – ఘృశ్నేశ్వరుడు - మహారాష్ట్ర          


Srisaila Mallikarjunudu

ద్వాదశ జ్యోతిర్లింగములలో శ్రీశైలం రెండవది. ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో ఉంది.
స్థలపురాణం : పార్వతి పరమేశ్వరుల కుమారులు గణేశుడు, స్కందుడు రుద్రగణాధిపత్యంకై జరిగిన పోటీలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షణం చేసి గెలిచి గణాధిపత్యం దక్కించుకుంటాడు. స్కందుడు అలిగి కైలాసం వదలిపెట్టి శ్రీశైలం వచ్చి క్రౌంచపర్యతం మీద తన కాళ్ళకు మంత్రబద్ధంగా బంధనములు ఏర్పాటు చేసుకొని ఆసీనుడు అవుతాడు.
కుమారుని అలక తీర్చి కైలాసమునకు తీసుకురమ్మని శివపార్వతులు నారదుని పంపుతారు. నారదుడు వచ్చి ఎంత నచ్చ చెప్పినా స్కందుడు వినేలేదు. పార్వతీ దేవి పుత్రవాత్సల్యము చేత శ్రీశైలమునకు వచ్చి కుమారునకు నచ్చచెప్పినా వినలేదు. అప్పుడు పార్వతీ దేవి శ్రీశైలంలోని స్థిరనివాసం ఏర్పరుచుకొంటొంది. శివుడు కూడా ఆమెను అనుసరించి శ్రీశైలంలో జ్వోతిర్లింగ స్వరూపుడై వెలుస్తాడు.
నారదుడు, బ్రహ్మాది దేవతలు అచ్చటికి వచ్చి శివపార్వతులు, స్కందుని పూజిస్తారు. ఆ తరువాత వినాయకుడు కూడా శ్రీశైలానికి వచ్చి సాక్షిగణపతి పేరున వెలుస్తాడు.
కాలాంతరంలో శ్రీశైల ప్రాంతమును పరిపాలిస్తున్న చంద్రగుప్తుని దంపతులకు ఒక కుమార్తె  జన్మిస్తుంది. ఆమె పసికందుగా ఉండగానే చంద్రగుప్తుడు యుద్ధానికి వెళతుడు. కాని యుద్ధం 16 సంవత్సరముల పాటు జరుగుతుంది. యుద్ధంలో విజయం సాధించిన తరువాత చంద్రగుప్తుడు తిరిగా తన రాజ్యనికి వస్తాడు. అప్పటికి అతని కుమార్తె 16 సం.ప్రాయంలో ఉంటుంది. చంద్రగుప్తుడు ఆమెను చూసి కామాంధుడై ఆమెను చెరపట్టబోతాడు. మహారాణి ఆమె మన కుమార్తె అని చెప్పినా మోహావేశుడై చంద్రగుప్తుడు వినకుండా ఆమెను వెంబడిస్తాడు.
చంద్రగుప్తుని బారినుండి తప్పించుకొనుటకు చంద్రావతి కొండమీద నుండి కృష్ణానది లోనికి దూకుతుంది. కృష్ణనది రెండుగా చీలుతుంది. ఆ దారిలోనుండి ఆమె నడుస్తుండగా చంద్రగుప్తుడు ఆమెను వదలకుండా వెబడిస్తాడు. చంద్రావతి తండ్రిని చూసి కామాంధుడవై వావివరుసలు గానకున్నావు, నీవు బండరాయివై పడివుండమని శపిస్తుంది. చంద్రగుప్తుడు పాతాళ గంగ యందు పచ్చటి బండరాయిగా మారిపోతాడు. అందువలనే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందంటారు.
చంద్రావతి శ్రీశైలమున జ్యోతిర్లింగముగా వెలసిన శివుని మల్లెపూలతో సేవింపసాగినది. ఒకనాడు శివుడు ఆమె భక్తికి సంతసించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మంటాడు. చంద్రావతి స్వామి ఈ మల్లెమాలను శాశ్వతముగా నీ కంఠసీమనందు అలంకరించుకొనుము మరియు నీ జటజూటమునందు మల్లెమాలను అర్థచంద్రాకారముగా నా స్వహస్తములతో అలంకరించు భాగ్యము ప్రసాదించుమని వేడుకొంటుంది. శివుడు అనుగ్రహించి కుమారీ నేటి నుంచి నేను మల్లికార్జుడను పేరున భక్తులను అనుగ్రహిస్తాను. ఈ మల్లెమాల నా శిరమునందు మూడువందల కోట్ల సంవత్సరము ఉంటుందని వరమిస్తాడు.
ఆ నాటి నుండి శ్రీశైలమునందున్న జ్యోతిర్లింగము మల్లికార్జున లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. మల్లికార్జునుని ఆగస్త్య మహర్షి, వేదవ్యాసులవారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి ద్వాపరమున పంచపాండవులు ద్రౌపతీ దేవితో సహా అర్చిస్తారు. అప్పటి నుండి శ్రీశైలం భక్తజనానికి ఆరాధ్యమై ప్రకాశిస్తుంది.
ఎలా వెళ్ళాలి ? శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్నిముఖ్య పట్టణాలనుండి బస్సులలో వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి 232 కి.మీ. దూరంలో మరియు విజయవాడ నుండి గుంటూరు, వినుకొండ, దోర్నాల మీదుగా 260 కి.మీ. దూరంలో ఉంటుంది. 

Omkareswara Lingam

నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వస్తాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి గౌరవ మర్యాదలతో అతిధి సత్కారాలు చేస్తాడు. తదుపరి ఇరువురి ప్రసంగంలో వింధ్య పర్వతుడు నా యందు సమస్త సంపదలు సకల ధాతువులు మిక్కిలిగా ఉన్నాయి. కాబట్టి నేనే పర్వతాలన్నిటి సార్వభౌముడని అన్నాడు.
అందులకు నారదుడు వింధ్యా నీ ఎలా పర్వత సార్వభౌముడవు కాగలవు. మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతంపై విహరిస్తుంటారు. నీకా భాగ్యం లేదు కదా. అని అన్నాడు. వింధ్యుడు విచారించి మేరు పర్వతం కన్నా తానే గొప్పవాడనిపించుకోవటానికి నిశ్ఛయించుకొన్నాడు.
వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి దాని మధ్య పార్థివ లింగమును స్థాపించి శివుని కొరకై ఘోర తపమాచరించాడు. ఇట్లు నూరు మాసములు కఠోర తపస్సు సాగిన తరువాత శివుడు అనుగ్రహించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మన్నాడు.
వింధ్యుడు వినయంతో నమస్కరించి శంకరా...మేరు పర్వతములపై విహరించు ఇంద్రాదులకు నీ పవిత్ర పాద పద్మమలు నిత్య పూజనీయములు అట్టి నీవు నా శిఖము నందు నివసించి పూజలందుకొనుమని ప్రార్థించాడు.
వింధ్యాద్రి ప్రార్థనను మన్నించి కైలాసనాథుడు ఓంకార యంత్రమును మరియు అందులో స్థాపించిన పార్థివ లింగమును ఒకటిగా చేసి ఓంకారేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిసాడు. ఆనాటి నుండి కైలాసనాథుని బ్రహ్మాది దేవతలు సేవిస్తున్నందు వలన వింధ్యుడు ఆనందిస్తాడు.
ఎలా వెళ్ళాలి ? దగ్గరలోని విమానాశ్రయం ఇండోర్. సమీప రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర్ రోడ్. (ఖాండ్వా మీటర్ గేజ్ రైలు మార్గములో ఉన్నది.) ఓంకారేశ్వర్ రోడ్ నుండి 9 కి.మీ. దూరంలో ఓంకారేశ్వరం వున్నది.

Sri Vaidyanath Temple, Parli, Maharashtra 

వైద్యనాధేశ్యరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,
నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామి
లంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు.
ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల కూడా కాదు. అని హెచ్చరించాడు.
రావణుడు సంతోషంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని లంకకు బయలు దేరతాడు. దారిలో అఘుశంక తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. రావణనికి సమీపంలో గోవులను మేపుకుంటున్న ఒక బాలకుడు కన్పిస్తాడు. రావణుడు ఆ బాలుని పిలచి కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఆ బాలుడు ముమ్మారు పిలుస్తాను. రాకపోతే శివలింగాన్ని కింద పెడతాను అంటాడు. రావణుడు ఆత్మలింగాన్ని బాలకునికి అప్పగించి లఘుశంక తీర్చుకోవటానికి వెళతాడు.
కాని ఆ బాలకుడు వెంటనే మూడు సార్లు రావణుని పిలచి వెంటనే ఆ శివలింగాన్ని భూమిపై ఉంచుతాడు. రావణుడు ఆ లింగాన్ని లేపటానికి ప్రయత్నించగా ఆ శివలింగం పాతాళం దాకా పెరిగి కూరుకుపోతుంది. రావణుడు ఇది శివుని చర్యగా భావించి వెనుతిరిగి లంకకు వెళతాడు.
రావణాసురుడికి ఆత్మలింగం లభించటం ఇష్టం లేక దేవతల కోరిక మేరకు వినాయకుడే గొల్లవాని రూపం ధరించి రావణునికి ఆత్మలింగం దక్కకుండా చేస్తాడు. దేవతలు, వినాయకుడు కోరిక మేరక శివుడు వైద్యనాధేశ్వరుడు గా జ్వోతిర్లింగంగా వెలుస్తాడు.
జార్ఘండ్ లోని ధియోగర్ లోని జ్యోతిర్లింగాన్ని కూడా వైద్యనాథ్ జ్వోతిర్లింగంగా కొందరు భావిస్తారు.
ఎలా వెళ్లాలి ? వైద్యనాధేశ్యర దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్ పట్టణంలో ఉన్నది. పర్లి హైదరాబాద్ – మన్మాడ్ రైల్వే లైన్లోని పారబ్బాని రైల్వే స్టేషన్ కు దగ్గరలో కలదు. వసతి సౌకర్యాలు : ఇక్కడ బసచేయుటకు ధర్మశాలలు, వసతి గృహాలు, హోటళ్లు కలవు 

Sri Visweswara Lingam,Kasi 

సృష్టిని నిర్మించతలచి పరమేశ్వరుడు శివశక్తి స్వరూపము దాల్చినాడు. ఆ అర్థనారీశ్వరరూపము నుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడ నుండి వచ్చారో తెలియలేదు.
అప్పుడు అశరీరవాణి అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మము గూర్చి తపస్సు చేయండి అని అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి తెలియలేదు.
అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి ఐదు క్రోసుల విస్తారము గల ఒక పట్టణము ఉద్భవించినది. అదేకాశీ పట్టణం. నారాయణుడు కాశీ పట్ఠణము నందు ఘోర తపస్సు చేయగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు పట్టగా ఆ నీరు కాలువలై ప్రపవహించినది నారాయణుడా జలములను ఆశ్ఛర్యముతో తిలకించగా అతడి చెవికమ్మ జారి జలమునందు పడిపోయినది. ప్రదేశమే మణికర్ణకగా విరాజిల్లుతోంది. ఆ జలరాశి యందు మునిగిన కాశీ పట్టణమును శివుడు తన శూలాగ్రము నందు ధరించి రక్షించినాడు.
ఆ తరువాత నారాయణుడి నాభినుండి బ్రహ్మ అవతరించాడు. అతడు పదునాలుగు భువనములను, దేవ, మానవ, దానవ జాతులను పశుపక్ష్యాదులను సృష్టించాడు.
బ్రహ్మండమును రెండు భాగములుగా ఛేదించి పై భాగాన ఏడు లోకాలను క్రింది భాగాన ఏడు లోకాలను సృష్టిస్తాడు.
అప్పుడు విష్ణు, బ్రహ్మాది దేవతలు మహర్షులు పరమేశ్వరుని స్మరించి ప్రార్థిస్తారు. వారి భక్తికి శివుడు సంతసించి వరము కోరుకొమ్మన్నాడు. అప్పుడు వారు దేవా నీవిచటనే శాశ్వతముగా అవతరించి సృష్టిని చల్లగా కాపాడమని ప్రార్థిస్తారు. అంతట శివుడు విశ్వేశ్వరుడనే పేరిట కాశీ పట్ఠణము నందు జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు.
కాశీపట్టణము వరుణ, అసి అను రెండు నదుల మధ్య నుండుట చేత ‘‘వారణాసి’’గా పేరు పొందినది. ఇచ్చట బ్రహ్మ, విష్ణు అనేక మంది దేవతలు యజ్గ్నాలు చేసారు. ఇక్కడ ఆదిశక్తి అన్నపూర్ణగా వెలసినది. కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు, గణపతులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిత్యులు, నవగ్రహములు ఇచట కొలువై ఉన్నారు.
ఎలా వెళ్ళాలి ? ఉత్తరప్రదేశ్ నందు గల కాశీకి ఆంధ్రప్రదేశ్ లోని అని ముఖ్యపట్టణముల నుండి విమాన మరియు రైలు సౌకర్యం కలదు. 

Kedaranath

కేదార్నాథ్ దేవాలయం, కేదార్నాథ్ కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు.. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం. పర్వత శ్రేణి మధ్య ఉన్న కేదార్నాథ్ దేవాలయం, హిందూ మతం పరమ శివుని యొక్క జ్యోతిర్లింగా ను ప్రతిష్టించారు. దీనికి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగా మొత్తం12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైనది.ఆది శంకరాచార్య 8 వ శతాబ్దం AD లో ఈ ఆలయంను స్థాపించారు నికి దగ్గరలోనే మందాకిని నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం పాండవులచే నిర్మించబడింది. ఒక పాత ఆలయం ప్రక్కనే ఉంది. ఒక అసెంబ్లీ హాల్ లోపలి గోడల మీద వివిధ హిందూ మతం దేవుళ్ళ మరియు దేవతల యొక్క చిత్రాలను చూడవచ్చు. పౌరాణిక కథలు ప్రకారం శివ మౌంట్ అయిన నంది దూడ విగ్రహాన్ని ఒక గార్డ్ గా ఆలయం వెలుపల ఉంచబడుతుంది. 1000 సంవత్సరాల నాటి ఈ దేవాలయమునకు ఒక దీర్ఘచతురస్రాకార వేదిక మీద ఒకే విధంగా కత్తిరించిన భారీ రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. భక్తులు లార్డ్ ను పూజించటానికి ఆలయంలో ఒక 'గర్భగుడి' ఉంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక మండపంను చూడవచ్చు. జానపద కధ ప్రకారం, కురుక్షేత్ర పోరాటం ముగిసిన తర్వాత పాండవులు తమ పాపాలకు పశ్చాత్తాపంగా ఈ దేవాలయానికి వచ్చారు. 

Sri Ghusmeswara Lingam, Maharashtra 

  ఒకప్పుడు దేవగిరి అను ఊరునందు సుదర్ముడనే బ్రాహ్మాణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. వీరికి సంతానము లేదు. ఒకనాడు వారి ఇంటికి ఒక యతి వచ్చాడు. ఆ యతీంద్రునికి అతిధి సత్కారము చేసి భిక్ష స్వీకరించమని కోరగా సంతానహీనుల ఇంట భిక్ష స్వీకరించరాదనే నియమం ఉందని తెలిపి వెళ్ళిపోయాడు.
భార్యా భర్తలు మిక్కిలి దుఖించి ...సుధర్ముని భార్య సుదేహ స్వామీ మన వంశము అంతరించకుండా మీరు నా చెల్లెలు ఘుశ్మను వివాహమాడవలసిందని కోరటంతో వారి విహాహం జరుగుతుంది. ఘుశ్మ మహప్రతివత. భర్తనే ప్రత్యక్ష దైవంగా సేవించే ఆమె మనస్సున శివుని క్షణక్షణము స్మరించేది. ఆమె గర్భవతియై ఒక బాలునికి జన్మనిస్తుంది. బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతుంటాడు.
ఆ బాలుని గాంచి తనకి సంతానము కలగలేదేనే బాధ సుదేహకు అధికమై అది ఆ బాలునిపై ద్వేషముగా మారింది. ఒకనాటి రాత్రి అందరూ నిదురించుచుండగా సుదేహ ఆ బాలుని భుజాన వేసుకొని ఊరి బయటకు వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పారేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి నిద్రపోయింది.
మర్నాడు యధాప్రకారం ఘుశ్మ నీటికై చెరువుకు వెళ్ళి, చెరువులో దిగి బిందె ముంచి నీళ్ళు తీసుకుంటున్న సమయంలో ఆ బాలుడు ఆమె కాళ్ళు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ చెరువులో నుంచి బయటకు వస్తాడు. ఆమె కుమారుని ముద్దాడి ఇంట్టో ఉండవలసిన కుమారుడు ఈ చెరువులోనికి ఎలా వచ్చాడని సంశయించింది. ఆ బాలుడు ‘‘అమ్మా నాకు ఒక కల వచ్చింది. కలలో నేను మరణించి మరల బ్రతికినట్లు కనిపించింది’’ అని చెబుతాడు. ఆమె ఆశ్ఛర్యపోవుచుండగా శివుడు ప్రత్యక్షమై సాధ్వీ..నీ కుమారుడు చెప్పినదంతయూ నిజమే...సుదేహ ద్వేషముచేత నీ కుమారుని చంపి ఈ తటాకమున పారవేసినది. నీవు మహాసాధ్వివి నా భక్తురాలివైనందున నేను నీ కుమారునికి పునర్జన్మనిచ్చాను’’ అని పలికి నీ సోదరిని శిక్షించెదనని పలుకుతాడు. సుదేహ శివుని పాదములపై పడి స్వామి దుర్గుణముల చేత ప్రేరణ పొంది ఇట్టి అకృత్యములు జరుగుతాయి. మా అక్కగారిని క్షమించి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకొనగా శివుడు సంసించి ఘశ్మా.. నీ ప్రవర్తనకు సంతసించి నేను ఇచ్చటనే జ్యోతిర్లింగ రూపమున ఘుశ్మేశ్వరునిగా వెలుస్తానని వరమిచ్చి జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. ఈ ఘుశ్మేశ్వరుని ఆరాధించువారికి పుత్రశోకము కలగదు.
ఎలా వెళ్ళాలి ? ఘుశ్మేశ్వరము మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు దగ్గరలో వేలూరు గ్రామమునందు కలదు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి వేలూరు గ్రామం 29 కి.మీ. దూరంలో ఉంటుంది. ఎల్లోరా గుహలు 1 కిలోమీటరు దూరంలో కలవు.
వసతి : ఇక్కడ వసతి సౌకర్యములు తక్కువ కాబట్టి ఔరంగాబాద్ పట్టణంలో బసచేయటం మంచిది.

ThanQ Visit Again.

Related Posts