హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి గారు
మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అయినా, చిరంజీవిగానే ఆయన సుపరిచితుడు. కేంద్ర మంత్రి కాకముందే చిరంజీవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండది. ఎందుకంటే, తన డాన్సులతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ ఊపు ఊపేశారు చిరంజీవి. బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, అక్కడా తన ఉనికిని చాటుకున్నారాయన. 
తెలుగు తెరపై రెండు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యం చిరంజీవిదే. నెంబర్‌ వన్‌ అన్న పొజిషన్‌ జోలికి ఇంకొకర్ని రానివ్వలేదాయన. తెలుగు సినీ బాక్సాఫీస్‌కి చిరంజీవి కొత్త అర్థం చెప్పారు. రికార్డులంటే చిరంజీవి మాత్రమే.. అనేంతలా తెలుగు సినీ పరిశ్రమని శాసించారు చిరంజీవి. ఈ విషయంలో ఎవరూ విభేదించే అవకాశాలే లేవు. ఫ్లాప్‌ సినిమా అంటే ఐదు నుంచి ఏడు వారాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేది. చిరంజీవితో సినిమా తీసి నష్టపోయినవారు లేరు, ఆయనకి స్టార్‌డమ్‌ వచ్చాక. ఫ్లాపయినా నిర్మాత సేఫ్‌.. హిట్టయితే, నిర్మాతకి పండగే పండగ.. ఇదీ తెలుగు సినీ రంగంలో చిరంజీవికి మాత్రమే చెల్లిన 'లెక్క'. 
రోజులు మారాయి. 'ఇంద్ర', 'ఠాగూర్‌' తర్వాత తెలుగు సినిమా లెక్కలూ మారిపోయాయి. సరిగ్గా ఆ టైమ్‌లోనే చిరంజీవి సినిమాల్ని తగ్గించేశారు. 'శంకర్‌దాదా జిందాబాద్‌' తర్వాత చిరంజీవి హీరోగా సినిమా ఇప్పటిదాకా రాలేదు. దాదాపు పదేళ్ళపాటు చిరంజీవి వెండితెరకు దూరమయ్యారు. 'మగధీర', 'బ్రూస్‌లీ' సినిమాల్లో కనిపించినా, చిరంజీవి హీరోగా సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కాలం తెచ్చిన మార్పులెన్నో వున్నాయి. బాక్సాఫీస్‌ లెక్కలు బాగా మారిపోయాయి. 
ఏడాది పాటు సినిమా ప్రదర్శితమవడం, 175 రోజుల ప్రదర్శితమవడం, హండ్రెడ్‌ డేస్‌.. 50 డేస్‌.. అనే ప్రశ్నే లేదిప్పుడు. తొలి రోజు ఎంత.? తొలి వారం ఎంత.? ఇదే లెక్క చుట్టూ నిర్మాతలు నానా తంటాలూ పడ్తున్నారు. ఆ లెక్కలు పట్టుకునే, స్టార్‌డమ్‌ అంటూ కొందరు హీరోలు, వారి అభిమానులు విర్రవీగుతున్నారు. కానీ, 'వన్‌ టూ టెన్‌ చిరంజీవిగారే.. ఆ తర్వాతే మేం ఎవరమైనా..' అని ఓ సందర్భంలో మహేష్‌ వ్యాఖ్యానించాడు. అది చిరంజీవి మీద గౌరవంతో అన్నాడో, నిజంగానే అన్నాడోగానీ, అది నిజం. 
పెద్ద హీరోల సినిమాలు హిట్టయితే ఓకే.. లేదంటే, నష్టాలు దారుణంగా వుంటున్నాయి. హిట్టయినా, నిర్మాతలకు డబ్బులు రాని పరిస్థితి. హైప్‌ పెంచడం కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసేయడం, ఆ తర్వాత చతికిలపడ్డం.. ఇది తెలుగు సినిమాకి, అందునా పెద్ద సినిమాలకు పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. ఈ లెక్కల నడుమ, చిరంజీవి హీరోగా కొత్త సినిమా రానుంది. అందుకే, ఈ ఏడాది పుట్టినరోజు చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్‌. 
బాలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్‌ని శాసించిన అమితాబ్‌ బచ్చన్‌, ఇప్పుడు తనకు సూటయిన సినిమాలే చేసుకుంటున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తీరు వేరు. తన సినిమాలతో ప్రేక్షకుల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లనీ, నిర్మాతల్నీ నిలువునా ముంచేస్తున్నారు. ఆకాశాన్నంటే అంచనాల నడుమ రజనీకాంత్‌ అన్న పేరు, సినిమా పబ్లిసిటీకి పనికొస్తుంది తప్ప, ఆ సినిమా నిర్మాతని కాపాడలేకపోతోంది. మరి, చిరంజీవి పరిస్థితేంటి.? 
తమిళ సినిమా 'కత్తి'ని చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. మరి, ఈ సినిమాతో చిరంజీవి, తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త అర్థం చెబుతారా.? చెప్పగలిగితే మాత్రం.. మహేష్‌ మాట నూటికి నూరుపాళ్ళూ నిజం. వన్‌ టూ టెన్‌ చిరంజీవే. ఓవర్సీస్‌ లెక్కలు, భారీ అంచనాలు, తొలి రోజు వసూళ్ళు.. వీటన్నిటి నడుమ, మెగాస్టార్‌ ఇమడలేకపోతే మాత్రం.. కష్టమే.! 
ఏదిఏమైనా, సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపై సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందించేద్దాం. హ్యాపీ బర్త్‌ డే టూ మెగాస్టార్‌ చిరంజీవి.

‘పునాది రాళ్లు’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పునాది వేసుకొని ఆ తరువాత వరుస సూపర్ డూపర్ హిట్స్ తో విజేత గా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ గా ముద్ర వేసుకొని గ్యాంగ్ లీడర్ బిరుదు తో ముఠా మేస్త్రి అనిపించుకోవడం ఒక్క చిరంజీవి కే సొంతం.. టాలీవుడ్ సినిమాకు తన డాన్సులతో నటనతో చిరు మరింత కళ తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో విలన్ గా అలరించిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొని సంచలనం సృష్టించాడు మెగా స్టార్. ఎనలేని అభిమానులతో పాటు తిరుగులేని రికార్డులు కూడా చిరు సొంతం. చిరు చిత్రం వస్తుందంటే చాలు ఆ రోజు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే. 

నైజాం థియేటర్ లపై కార్పొరేట్ కన్నుటాలీవుడ్ బాక్సాఫీస్ లో నైజాం ఏరియాకి మకుటం లేని మహారాజుల్లా ఉన్న కొందరు అగ్ర నిర్మాతలకు - పంపిణీదారులకి చెక్ పెట్టేందుకు సన్నాహాలు మొదలైయ్యాయి. ఇందుకోసం కొందరు సినీ పెద్దలు సైలెంట్ ఓ పక్కా ప్లాన్ గీసినట్లు సమాచారం. మల్లూవుడ్ ని శాసిస్తున్న ఓ సినిమా కార్పొరేట్ గ్రూప్ గత కొన్నాళ్లుగా నైజాం ఏరియాల్లో ఉన్న బి - సి సెంటర్స్ ని లీజ్ తీసుకునే పనిలో ఉంది. హైదరాబాద్ తో పాటు వరంగల్ - నిజమాబాద్ - అదిలాబాద్ - కరీంనగర్ తదితరల ఏరియాల్లో ఉన్న సింగిల్ థియేటర్లను ఆ కార్పొరేట్ వారు మిగతా వారికంటే ఎక్కువ కోట్ చేసి లీజ్ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే జరిగితే దాదాపు 50 శాతానికి పైగా నైజాం ఏరియాలో ఉన్న థియేటర్లు ఆ కార్పొరేట్ చేతికి వెళ్లిపోతాయని సినీజనాలు అంటున్నారు. అలానే ఆ కార్పొరేట్ గ్రూప్ పెద్దది కావడంతో థియేటర్స్ ఆపరేషన్ మొత్తం కొచ్చి - ముంబై నుంచి సాగుతోందని దీంతో ప్రస్తుతం నైజాం ఏరియాలో ఉన్న థియేటర్ మాఫియాకి తిప్పలు తప్పవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ లో మల్టీప్లెక్సుల విషయంలో కూడా ఇలానే జరిగిందని - భాగ్యనగరంలో ఉన్న మెయిన్ ఏరియాల్లో ప్రస్తుతం మల్టీప్లెక్సులదే హవా అని - ఇందులో స్క్రీన్లు కావాలంటే నిర్మాతలు మీడియేటర్లతో పనిలేకుండా డైరెక్టుగా మాట్లాడుకొని సినిమా ప్రద్శించుకొనే అవకాశం ఉంటుందని కలెక్షన్ లెక్కలు తారు మారు అయ్సే పరిస్థితే ఉండదనేది ట్రేడ్ వర్గాల టాక్. మరి నైజాంలో సినీ దందాను ఆ కార్పొరేట్ వారు ఎంతమేరకు ఆపుతారో చూడాలి.

బాలయ్య 102వ సినిమా హీరోయిన్ గా నయనతార సంక్రాంతికి రిలీజ్సింహా సినిమాతో బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ గా మారిపోయిన నయనతార - ఆ తరువాత శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో నటించి నందమూరి అభిమానుల్ని మెప్పించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నూరవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా నయనతారను తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో నయన్ - కోలీవుడ్ లో బిజీగా ఉండటమే మెయిన్ రీజన్ అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా బాలకృష్ణ 102వ సినిమాలో నయనతార హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సీ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కే.ఎస్.రవికుమార్ దర్శకుడు.

ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ కు తాజాగా నయనతార హాజరవుతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ వినూత్నమైన పాత్ర పోషించబోతుందని నయన్ - బాలయ్య మధ్య నడిచే సన్నివేశాలు సింహాని తలపిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూకుడు మీదున్న బాలయ్య నుంచి ప్రస్తుతం పైసా వసూల్ రాబోతుంది. ఆ తరువాత సంకాంత్రికి ఈ 102వ సినిమా వస్తుందని సినీ జనాలు అంటున్నారు. మరి బాలయ్యతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన నయన్ - ఎలా కనిపించబోతుందో తెలియాలంటే ఫస్ట్ లుక్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ లో ముమైత్ కి భలే ఛాన్స్ఇప్పుడు బిగ్ బాస్ చూడందే అస్సలు తెలుగు ప్రేక్షకులు చాలామంది నిద్రే పట్టట్లేదు. ఏముందిలో అనుకున్న రేంజ్ నుండి ఏమవుతుందో అంటూ ఆతృత క్రియేట్ చేసే రేంజుకు వచ్చేసింది ఈ టివి షో. తొలిసారిగా తెలుగులోకి ఇటువంటి షో రావడం ఒకెత్తయితే.. దీనిని జూ.ఎన్టీఆర్ హోస్ట్ చేయడం మరో ఎత్తు. దాని కారణంగా మాంచి రెస్పాన్స్ వచ్చేసింది.

అయితే గత వారం.. ఈ బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో మాత్రం జనాలకు సస్పెన్స్ హోరెత్తిపోయింది. అసలు ఈ కార్యక్రమంలో ఎంతో యాక్టివ్ గా ఉండే ముమాయత్ ఖాన్ ఎలిమినేషన్ ఫేస్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. శనివారం నాడు హరితేజ ధనరాజ్ లకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం కలిగించిన జూనియర్ ఎన్టీఆర్.. ఆదివారం హీరోయిన్ అర్చన.. ఐటెం బాంబ్ ముమాయత్ లలో ఎవరికి ఉద్వాసన పలుకుతాడు అంటూ అందరూ షాకవుతున్నవేళ.. ఎన్టీఆర్ ముమాయత్ పేరును చెప్పాడు. పీపుల్స్ పోల్ లో ఆమె పేరే వచ్చిందట. అయితే ఆమెకు మరో అవకాశం కల్పిస్తూ ట్విస్టు ఇచ్చాడు ఎన్టీఆర్.

ఇలా బిగ్ బాస్ నుండి హ్యాపెనింగ్ కంటెస్టంట్లను ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందో అనుకున్నారేమో.. వెంటనే ముమాయత్ కు తిరిగి రావడానికి ఛాన్సిచ్చారు. ఆల్రెడీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొనడానికి ఆమెకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్.. ఇప్పుడు ఆమెను సీక్రెట్ రూములో ఉండి హౌస్ లో జరిగేదంతా చూడమని.. త్వరలోనే మళ్ళీ హౌసులోకి ఆమెను ప్రవేశపెడతామని తెలిపారు. మొత్తానికి ముమాయత్ భలే లక్కీ గురూ!

సినిమాగా కెసిఆర్ జీవిత చరిత్రతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఈ సినిమా చర్చల దశల్లోనే ఉంది. ఇప్పుడు మరోసారి ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, రాజ్ కందుకూరితో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
చిరు ఉయ్యాలవాడ ఫాస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న జక్కన్న
‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను ఎంతగా ఇన్ స్పైర్ చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నా.. అల్లు అరవింద్ రూ.500 కోట్లతో ‘రామాయణం’ అనౌన్స్ చేశాడన్నా.. సుందర్ రూ.250 కోట్లతో ‘సంగమిత్ర’ తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నా.. అన్నింటికీ ఆ ధైర్యాన్నిచ్చింది దర్శక ధీరుడు రాజమౌళే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ముందు మామూలుగా తీయాలనుకుని.. ఆ తర్వాత దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రణాళికలు వేయడానికి కూడా ‘బాహుబలి’తో రాజమౌళి స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు.

మొత్తానికి పది నెలలుగా జరుగుతున్న స్క్రిప్టు పనులు.. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ‘ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు.

YSR పార్టీ లోకి దగ్గుపాటి దంపతులు


ఏపీ సీఎం చంద్రబాబు తోడల్లుడు అన్న నందమూరి తారక రామరావు  పెద్దల్లుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? విపక్ష నేత జగన్  చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయంటే అవుననే అంటున్నారు  పోలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయాలపై తీవ్ర చర్చకు దారి తీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్త కాదు. గతం లో ఆయన టీడీపీలో, కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు.

ఆయన సతీమణి అన్నగారి కూతురు పురంధేశ్వరి కూడా కేంద్రం లో మంత్రిగా చక్రం తిప్పారు. అయితే గత కొన్నాళ్లుగా దగ్గుబాటి రాజకీయాలకు  దూరంగా ఉన్నారు. కానీ పురంధేశ్వరి మాత్రం యాక్టివ్ పోలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 2019 ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయింది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు జగన్ లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు టికెట్ల  హామీలు ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి  పోలిటికల్ గా మరోసారి అరంగేట్రం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన గానీ ఆయన కుమారుడిని గానీ రంగంలోకి దింపాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట!…

దీనికిగానే  ఇప్పటివరకు ఫ్యామిలీలో చర్చలు పూర్తయ్యాయని  అందుకే దగ్గుబాటి ఇప్పుడు పార్టీల అన్వేషణలో పడ్డారని సమాచారం. అంటే 2019 నాటికి బలమైన పక్షంగా ఉండే పార్టీలో చేరాలని అదే సమయంలో పరుచూరి నియోజక వర్గాన్ని తమ చేతుల్లో పెట్టే పార్టీని ఆయన ఎంచుకుంటున్నారని అంటున్నారు. దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టు పరిశీలన కోసం వచ్చారు. ఈ సమయంలో ఆయన మాజీ ఎంపీ ఉండవల్లిని వెంట తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇదే అనుమానానికి అవకాశం కల్పించింది. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన పేరుతో దగ్గుబాటి ఉండవల్లిని భేటీ అయ్యారా అన్న చర్చకు వచ్చింది. కేవలం రాజకీయాలను చర్చించేందుకే దగ్గుబాటి పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఉంటారంటున్నారు విశ్లేషకులు.

ఈ సందర్భంగా ఉండవల్లి దగ్గుబాటిల మధ్య రాజకీయంగా చర్చలు బాగా నడిచాయంటున్నారు. తానుగానీ, తన కుమారుడుగానీ పోలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఏపార్టీ అయితే బాగుంటుందని దగ్గుబాటి చర్చించినట్టున్నారు అని అంటున్నారు. ఇప్పటికే తన భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉన్నందున ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఎలా ఉంటుందని చర్చింపుకు వచ్చింది. వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకుంటే పరుచూరు సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉంటుందని, ఒక వేల ఇరువురి మధ్య పొత్తు లేకపోతే పరిస్థితి ఏంటని చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

ఇక అదే సమయంలో జగన్ పార్టీ వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందన్న విషయం చర్చకు వచ్చింది. ముఖ్యంగా కుమారుడు పోలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీలోకి వెళ్ళడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో  ఉండవల్లి జగన్ పార్టీ లోకే చేరడమే  మంచిదన్నట్లుగా తెలిసింది. మరి రాబోయే రోజుల్లో దగ్గుబాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక జగన్ పార్టీలోకి చేరితే కేవీపీ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి రెండు సూపర్ ఆఫర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పురంధేశ్వరికి కోస్తాలో ఆమె కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎంపీ సీటుతో పాటు ఆమె తనయుడు చెంచురామ్ లేదా భర్త వెంకటేశ్వరరావుకు  పరుచూరు అసెంబ్లీ సీటుపై హామీ వచ్చినట్లు సమాచారం.